రాఘవేంద్రరావుకు ఆ బిందెలే కావాలంట
ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ రీమిక్స్ తో మరోసారి వార్తల్లోకెక్కారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈ దర్శకుడు గతంలో తీసిన దేవత సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ఇది. ఇప్పుడీ పాటను దర్శకుడు హరీష్ శంకర్, వాల్మీకి సినిమాలో పెట్టుకున్నాడు. సినిమా ప్రమోషన్ ను కూడా ఈ పాట చుట్టూనే తిప్పుతున్నాడు. పనిలోపనిగా రాఘవేంద్రరావును కూడా ఆహ్వానించాడు. అలా వాల్మీకి ప్రమోషన్ కు వచ్చిన రాఘవేంద్రరావు మరోసారి తన రసికతను చాటుకున్నారు.
వాల్మీకి సినిమాలో తన పాట రీమిక్స్ లో నటించిన పూజా హెగ్డేను ఆకాశానికెత్తేశారు రఘు. మొదటి సినిమాలో చూసినప్పుడే పూజా హెగ్డే పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పానని, తను చెప్పినట్టుగానే పూజా పెద్ద హీరోయిన్ అయిపోయిందన్నారు. అక్కడితో ఆగకుండా పాటలో పూజా హెగ్డే నడుము మీద పెట్టుకున్న బిందెను తనకు ఇస్తే, ఇంట్లో పెట్టుకొని దాచుకుంటానని యూనిట్ ను కోరారు.
రాఘవేంద్రరావే అనుకుంటే, హరీష్ శంకర్ మరింత రసికత చాటుకున్నాడు. మీడియా ముఖంగా రాఘవేంద్రరావును ఓ సెక్సీ క్వశ్చన్ అడిగాడు. హీరోయిన్లందర్నీ రకరకాల పండ్లతో బొడ్డుపై కొట్టిన రాఘవేంద్రరావు.. పూజా హెగ్డే విషయానికొచ్చేసరికి ఏ పండుతో ఆమె బొడ్డుపై కొడతారంటూ ప్రశ్నించారు. పూజా హెగ్డే ఎర్రగా బుర్రగా ఉంటుంది కాబట్టి చెర్రీ పండ్లతో కొడతానంటూ అంతే రొమాంటిక్ గా సమాధానమిచ్చాడు దర్శకేంద్రుడు.
- Log in to post comments