సిగ్గులేనోడా... వర్మని తిట్టిన పాల్

KA Paul blasts on Ram Gopal Varma
Friday, December 13, 2019 - 16:00

రామ్ గోపాల్ వర్మ తీసిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాని విమర్శకులు చీల్చి చెండాడారు. అయితే... ఈ సినిమాలో కే ఏ పాల్ ని పోలిన పాత్రతో చేయించిన కామెడీ గురించి ఆ ఇవాంజెలిస్ట్ స్పందించారు. తన గురించి ఏమి చేసిన పర్లేదు కానీ జీసస్ క్రీస్తు ప్రస్తావనని తీసుకురావడంపై అభ్యంతరం తెలిపారు పాల్. "సిగ్గులేనోడా... దేవుణ్ణి లాగుతావా... ఇలాంటి వాటిలోకి..." అంటూ వర్మపై విరుచుకుపడ్డారు. 

నీకు దమ్ముంటే చూపించుకో.... కానీ ఇలాంటి పిచ్చి చేష్టలు వద్దు అంటూ సలహా ఇచ్చారు పాల్. అంతే కాదు, నాతో పెట్టుకున్నోడు ఎవడైనా బాగుపడ్డాడా అంటూ ప్రశ్నించారు కే ఏ పాల్. ఈ రోజు సినిమా అందుకే ఫెయిల్ అయింది కదా అన్నారు. "బాబు మీడియా వాళ్ళు మీరు చెప్పండి .... అది ప్లాప్ అయింది అని... చెప్పండి.. ఇలాంటివాళ్లను ఎంకరేజ్ చేయొద్దు... " 

"నీ పిచ్చి పిచ్చి మూవీస్ ఇప్పటివరకు రిలీజ్ అయ్యాయి... ఇప్పుడు దేవుడి శాపానికి, నా శాపానికి గురవుతావ్ . ప్రజలారా... ఇలాంటి పనికిమాలిన సినిమాలకు వెళ్ళకండి," అంటూ పాల్ వర్మపై విరుచుకుపడ్డారు. "బీ కేర్ఫుల్ ..ఇది ఫైనల్ వార్నింగ్. మారు... మారితే...స్టీవెన్ స్పెయిల్బర్గ్ వంటి గొప్ప మేకర్స్ ని పరిచయం చేస్తా," పాల్ వర్మకి సలహా ఇచ్చారు