సేమ్ టు సేమ్ అంతా కబాలి

Is Kaala going to be another Kabali?
Tuesday, June 6, 2017 - 16:15

కబాలి సినిమా గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో ఉంటుంది. తాజాగా రజనీకాంత్ సెట్స్ పైకి తీసుకొచ్చిన కాలా సినిమా కూడా మాఫియా నేపథ్యంలోనే సాగుతుంది. ఈ రెండు సినిమాలకు ఒకడే దర్శకుడు. సంగీత దర్శకుడు కూడా సేమ్. ఈ విషయాల్ని పక్కనపెడితే ఇప్పుడీ రెండు సినిమాల క్లైమాక్స్ కూడా ఒక్కటే అంటున్నారు.

కబాలి సినిమాలో చివర్లో రజనీకాంత్ చనిపోతాడు. ఫ్యాన్స్ ఒప్పుకోరు కాబట్టి రజనీకాంత్ చనిపోయే షాట్ మాత్రం చూపించరు. బట్ చనిపోయాడనే విషయం మాత్రం క్యారీ అవుతుంది. సేమ్ ట సేమ్ కాలా సినిమా క్లైమాక్స్ కూడా ఇంతే అంటున్నారు.

ముంబయిలో అణచివేతకు గురవుతున్న తమిళ ప్రజల కోసం కరికాలన్ అనే వ్యక్తి కాలాగా మారతాడు. తన వాళ్ల కోసం ఏకంగా ఓ సామ్రాజ్యాన్నే సృష్టిస్తాడు. ఆ సామ్రాజ్యంలో “కాలా రూల్స్” అమలవుతుంటాయి. అలా ఓ వ్యవస్థను ఏర్పాటుచేసిన కాలా, చివర్లో శత్రువుల చేతిలో మరణిస్తాడట. ప్రస్తుతానికైతే కాలా సినిమాపై ఇదే పుకారు ప్రచారంలో ఉంది. రజనీకాంత్ కు ఇదే చివరి చిత్రం అంటున్నారు. తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడట సూపర్ స్టార్.