కోలీవుడ్‌లో కాజల్‌కి డిమాండ్‌

Kajal Aggarwal in much demand in Kollywood
Tuesday, September 11, 2018 - 23:15

కాజ‌ల్ అగ‌ర్వాల్‌కి ఇప్ప‌టికీ క్రేజ్ త‌గ్గ‌డం లేదు. 33 ఏళ్ల వ‌య‌సులోనూ కుర్ర‌హీరోలు, పెద్ద హీరోలు ఆమెతో డ్యూయెట్లు పాడేందుకు పోటీ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స‌ర‌స‌న రెండు చిత్రాలు చేస్తోంది. అలాగే శర్వానంద్ స‌ర‌స‌న సుధీర్ వ‌ర్మ చిత్రంలో న‌టిస్తోంది. తెలుగులో ఇంత బిజీగా ఉన్న టైమ్‌లోనే ఆమెకి కోలీవుడ్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. 

జ‌యం ర‌వి త‌మిళంలో న‌టిస్తున్న ‘తని ఒరువన్‌’ సీక్వెల్‌లో ఒక హీరోయిన్‌గా కాజ‌ల్ ఎంపికైంద‌ట‌. తని ఒరువ‌న్‌ని తెలుగులో ధృవ పేరుతో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రీమేక్ చేశారు. ఆ ఒరిజిన‌ల్ త‌మిళ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాజా. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ట‌. ఒక హీరోయిన్ కాజ‌ల్‌.

ఇక త‌మిళంలో ఆమె క్వీన్ రీమేక్‌లోనూ న‌టిస్తోంది. అది విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.