నరేష్ తో కాజల్ సై?

Kajal Aggarwal to pair up with Allari Naresh
Sunday, March 8, 2020 - 15:30

కాజల్ అగర్వాల్ కి అవకాశాలు తగ్గాయి. కానీ ఆమె అంత ఈజీగా కెరీర్ ని వదులుకునే రకం కాదు. ఇప్పటికే కొత్త కొత్త సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు అల్లరి నరేష్ సరసన జతకట్టాల్సిన సిట్యుయేషన్ లో పడింది. అల్లరి నరేష్ కామెడీ హీరో. అతని కెరీర్  బాలేదు. హీరో గా కంటిన్యూ చేసేందుకు... నానా తిప్పలు పడుతున్నాడు. 

ఐతే కొరియాలో రూపొందిన "డ్యాన్సింగ్ క్వీన్" అనే మూవీని తెలుగులో రానా రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కి కాజల్ అయితేనే బాగుంటుందట. అందుకే ఆమెని ఒప్పించారని సమాచారం. ఐతే, ఆమెకి హీరోగా ఇప్పుడు అల్లరి నరేష్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. కథ ప్రకారం కామెడీ చేసే హీరో అయితేనే బాగుంటుంది. నరేష్ కన్నా కామెడీ చేసే హీరో ఎవరుంటారు.  సో... నరేష్ బెస్ట్ ఛాయస్. కానీ కామెడీ హీరో సరసన నటిస్తే తన స్థాయి తగ్గుతుందని కాజల్ భావిస్తే ఎలా? అదే నిర్మాతల భయం. 

ఇప్పుడున్న సిట్యుయేషన్ లో కాజల్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది.