కాజల్ @ 35... ఇప్పటికీ క్రేజ్!

Kajal Aggarwal turns 35
Friday, June 19, 2020 - 13:15

ఈ రోజు కాజల్ బర్త్ డే. 35వ పుట్టిన రోజు. జనరల్ గా ఏ హీరోయిన్ కైనా ఇది రిటైర్మెంట్ ఏజ్... వదిన పాత్రలకి షిఫ్ట్ కావాలి. ఈ ఏజ్ కు అటుఇటుగా ఉన్న కొందరు తల్లి పాత్రలు కూడా చేసేస్తున్నారు. కానీ కాజల్ మాత్రం ఇంకా గేమ్ ఆడుతోంది.

కాజల్ ప్రయోగాలు చేయలేదు. గ్లామర్ పాత్రలే చేసింది. కాకపోతే కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆమెకు మంచి సినిమాలు పడ్డాయి. దానికితోడు అదృష్టం కలిసొచ్చింది. అందుకే ఆమె కెరీర్ లో డౌన్ ఫాల్స్ చాలా తక్కువ. ఇదొక సక్సెస్ సీక్రెట్ అయితే.. ఏదో ఒక ఇండస్ట్రీకి ఫిక్స్ అయిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరో సక్సెస్ సీక్రెట్.

ఓవైపు తెలుగులో ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి హీరోల సరసన ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆమె టాలీవుడ్ కు స్టిక్ అయిపోలేదు. కోలీవుడ్ లో స్టార్ హీరోలకు కూడా కాల్షీట్లు ఇచ్చింది. మధ్యమధ్యలో వచ్చిన హిందీ సినిమాలు కూడా చేసింది. ఆ ప్లానింగే కాజల్ కెరీర్ ను ఇన్నాళ్ల పాటు కొనసాగేలా చేసింది.

మరీ ముఖ్యంగా తను ఏ సినిమా చేసినా అందులో స్టార్ హీరోలు, క్రేజీ బ్యానర్లు ఉండేలా చూసుకుంది కాజల్. దీంతో ఆమెకు క్రేజ్ ఆటోమేటిగ్గా వచ్చింది. ఇవన్నీ ఒకెత్తయితే... ఈ 13 ఏళ్లలో తన గ్లామర్ ఎక్కడా చెక్కుచెదరకుండా, వయ్యారాలు చెదిరిపోకుండా కాజల్ తీసుకున్న జాగ్రత్తలు కూడా ఆమెను ఇన్నాళ్లు నిలబడగలిగేలా చేశాయి. ఇప్పటికీ కాజల్ లో అదే హాట్ నెస్.

కెరీర్ స్టార్ట్ చేసి పుష్కరం దాటినా కాజల్ కు అవకాశాలు క్యూ కట్టడానికి ఇదే కారణం. ప్రస్తుతం ఈ ఏడాదికి గాను ఈ చందమామ చేతిలో చిరంజీవి మెగా మూవీ "ఆచార్య", కమల్ "భారతీయుడు 2" వంటి ఐదు సినిమాలున్నాయి. ప్రస్తుతం లైమ్ లైట్లో ఉన్న ఏ టాలీవుడ్ హీరోయిన్ కు ఇన్ని సినిమాల్లేవ్. దటీజ్ కాజల్. 

Also Check: Kajal Aggarwal New Pics