కాజల్ మైనపు బొమ్మ ఇదే

Kajal Aggarwal wax statue unveiled
Wednesday, February 5, 2020 - 13:00

కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మేడం తుస్సాడ్ మ్యూజియంలో మంగళవారం ఈ విగ్రహంని పబ్లిక్ ప్రదర్శనకి పెట్టారు. ఇక మీరు  సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహాన్ని చూడొచ్చు ఇక. ఇప్పటికే ఈ మ్యూజియంలో మహేష్ బాబు స్టాచ్యూ కూడా ఉంది. మైనపు విగ్రహం కలిగిన స్టార్స్ లలో దక్షిణాదికి చెందిన మొదటి హీరోయిన్ కాజల్. 

"కొత్త ఇల్లు, కొత్త కారు....ఇలాంటి వాటిలో చాలామంది విజయాన్ని చూసుకుంటారు. నేను ఎప్పుడు ఇలాంటి వాటిలో థ్రిల్ పొందలేదు. మూమెంట్స్ లో ఆనందాన్ని పొందాను. ఆ క్షణం జీవించడంలో ఉన్న థ్రిల్ నాకు ఇష్టం. ఇతరుల అంచనాలకి సంబంధం లేకుండా మనకి ఎలా ఆనందం కలుగుతుందో తెలుసుకోవడం, ప్రశాంతంగా ఉండడం ... నా దృష్టిలో నిజమైన సక్సెస్," అని కాజల్ ఆ తర్వాత సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. 

మైనపు విగ్రహం ఆవిష్కరణ ఆనందంలో సినిమాటిక్ డైలాగులు వల్లించింది.