కాజల్ కు మిగిలింది ఇదొక్కటే

Kajal is focussing on Kannada
Friday, November 29, 2019 - 14:45

తన కెరీర్ ను పొడిగించుకోవడానికి, అందుకు అనుగుణంగా డబ్బు సంపాదించడానికి అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు కాజల్. ఇప్పటికే పరిశ్రమకొచ్చి పుష్కరం దాటిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కొత్తకొత్త దారులు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా శాండిల్ వుడ్ లోకి కూడా ఎంటరవుతోంది కాజల్.

అవును.. త్వరలోనే కన్నడలో ఓ సినిమా చేయబోతోంది కాజల్. ఉపేంద్ర హీరోగా రాబోతున్న కబ్జా అనే సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా రాబోతోంది. కాజల్ కు ఇదే తొలి కన్నడ సినిమా కాబోతోంది.

ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ లో తనదైన ముద్రవేసింది కాజల్. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఆమెకిప్పుడు కొత్త అవకాశాలు కావాలి. అందుకే తొలిసారిగా కన్నడ ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇది కూడా కవర్ అయిపోతే, అప్పుడేం చేస్తుందో చూడాలి. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.