ఆంటీగా మారుతోన్న కాజల్

కాజల్ అగర్వాల్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. శంకర్ తదుపరి చిత్రంలో ఆమె నటిస్తోంది. దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రంగా "భారతీయుడు 2" సినిమాని తీస్తున్నాడు. కమల్‌హాసన్ కథానాయకుడు ఇందులో. 20 ఏళ్ల క్రితం వచ్చిన "భారతీయుడు" సినిమాకిది సీక్వెల్. ఈ సినిమాలో కమల్‌హాసన్ వయసు మళ్లిన సేనాపతి అనే పాత్రలోనే కనిపించనున్నాడు. ఆయనకి భార్యగా కాజల్ నటించనుంది.
కమల్‌హాసన్‌కి భార్య అంటే ఆంటీ పాత్రనే. ఆమె గెటప్ కూడా మిడిల్ ఏజ్డ్ ఆంటీగానే ఉంటుందట. 32 ఏళ్లు వచ్చినా... కాజల్ ఇప్పటికీ వెరీ యంగ్‌గా కనిపిస్తోంది. అందుకే రానా, శర్వానంద్, బెల్లంకొండ వంటి యువ హీరోల సరసన ఎంచక్కా నటిస్తోంది. ఐతే ఇపుడు కమల్ సరసన తన ఏజ్ కన్నా చాలా పెద్ద వయసు ఆంటీగా కనిపించాలి.
వచ్చే నెలలో కమల్‌పై శంకర్ కీలక సీన్లు తీయనున్నాడు. ఐతే కాజల్ మాత్రం జనవరి నుంచి డేట్స్ ఇచ్చిందట.
- Log in to post comments