కరోనా టైంలో బ్రైడ్ గెటప్ ఇలా

Kalyani Priyadarshan's bridal photoshoot in corona times
Wednesday, June 17, 2020 - 22:45

కరోనా టైంలో పెళ్లి సంబరాలు సింపుల్ గా సాగుతున్నాయి. కానీ పెళ్లిళ్లు ఆగడం లేదు. తక్కువమంది గెస్టులతోనే పెళ్లి సంబరం కానిచ్చేస్తున్నారు. అందుకే... ఫ్యాషన్ మేగజైన్లు  కూడా కరోనా థీమ్ తో ఫోటోషూట్ లు చేస్తున్నాయి. "వోగ్" అనే ఫేమస్ ఫ్యాషన్ మేగజైన్ కూడా "ది న్యూ నార్మల్" (ఇకపై ఇదే సాధారణం) పేరుతో పెళ్లి కూతురు గెటప్ ఇలా ఉండాలి అంటూ ఫోటో షూట్ చేసింది. ఈ షూట్ కి మోడల్ గా "హలో", "రణరంగం", "చిత్రలహరి" సినిమాల్లో నటించిన కళ్యాణి ప్రియదర్శన్ ని తీసుకోండి. 

ముఖానికి మాస్క్ వేసి షూట్ చేసింది. 

కళ్యాణికి సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రావడం లేదు కానీ ఫోటో షూట్లు మాత్రం గట్టిగానే చేస్తోంది. ఇకపై హీరోయిన్లు  అందరూ ఇలా మాస్క్ లు వేసుకొని షూట్ చేస్తారేమో.