నన్ను వేధిస్తున్నారు: కమల్ హాసన్

లోక నాయకుడు కమల్ హాసన్ తనని వేధిస్తున్నారు అని అంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం పోలీసుల ద్వారా తనని ఇబ్బంది పెడుతోందని, ఈ విషయంలో కలగచేసుకోవాలి అంటూ కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. ఇదంతా... "భారతీయుడు 2" సినిమా షూటింగ్ లొకేషన్ లో జరిగిన క్రేన్ ప్రమాదం గురించే.
చెన్నై సమీపంలోని ఈవీపీ అనే ఫిలిం స్టూడియోలో "భారతీయుడు 2" సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురు మరణించారు. భారీ ఇండస్ట్రియల్ క్రేన్ ఉపయాగించి ఒక సీన్ తీస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఇప్పటికే కమల్ హాసన్ ని విచారించారు. తాజాగా.. అదే లొకేషన్ కి వచ్చి విచారణ చేస్తాము... దానికి మీరు హాజరు కావలి అని కమల్ హాసన్, డైరక్టర్ శంకర్ ని పోలీసులు ఆదేశాలు పంపారు. ఐతే, ఇలాంటి విచారణకు నన్ను మినహాయించాలని అంటున్నారు కమల్. తనని అవమానిస్తున్నారు అని, వేధిస్తున్నారు అనేది పోలీసులపై కమల్ ఆరోపణ.
రాజకీయ నాయకుడిగా మారిన కమల్ హాసన్ ని ఇరుకున పెట్టేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వం ఇలా చేస్తోందని కమల్ మాట.
శంకర్ మాత్రం రేపు ఈ విచారణకి హాజరు కానున్నారు.
- Log in to post comments

























