కమల్ లైఫ్ లో ఇప్పుడు ఈమేనా?

Kamal Haasan and Pooja Kumar, what's cooking?
Friday, November 8, 2019 - 18:15

అందరూ జెమినీ గణేశన్ ని కాదల్ మన్నన్ అని అంటారు కానీ మన కాలంలో చూస్తున్న ఆ నిత్య ప్రేమికుడు మాత్రం లోకనాయకుడు కమల్ హాసన్ అనే అనిపిస్తోంది. వాణి గణపతిని పెళ్ళాడి సారికతో లవ్ ఎఫైర్ కొనసాగించారు. మొదటి భార్యకి విడాకులు ఇచ్చాక సారికతో జీవనం సాగించారు. వీరిద్దరికి ఇద్దరు కూతుళ్లు... శృతి, అక్షర. సారికతో ఉన్నప్పుడే సిమ్రాన్ తో ప్రేమాయణం సాగించనట్లు చెన్నై గుసగుస. ఆ తర్వాత ఆఫిసియల్ గానే... నటి గౌతమి తో సహజీవనం సాగించారు కమల్. 

కమల్ హాసన్ కిప్పుడు 65 ఏళ్ళు. నవంబర్ 7న 65వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన సొంత ఊరిలో తన కుటుంబ సభ్యులందరితో ఫోటో దిగారు. ఆ ఫామిలీ ఫ్రేములో కమల్, ఆయన సోదరుడు చారు హాసన్, చారు హాసన్ కూతుళ్లు, మనవాళ్ళు, కమల్ కూతుళ్లు, ఇతర ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు. అందులో 'ఫ్యామిలీ మెంబర్' కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఆమే ....పూజ కుమార్. 

కమల్ హాసన్ సరసన విశ్వరూపం వంటి సినిమాల్లో నటించింది పూజ కుమార్. న్యూయార్క్ కి చెందిన ఈ ఎన్నారై  నటి ..తెలుగులో గరుడ వేగా లో కూడా నటించింది. అయితే, కమల్ హాసన్ ఫ్యామిలీ ఫొటోలో ఆమె ప్రత్యక్షం కావడంతో... ఇప్పుడు కమల్, ఆమె సంబంధం గురించి అందరూ చెవులు కోరుకుంటున్నారు. ఐతే, కమల్, పూజ ఇవన్నీ పట్టించుకునే రకం కాదు.