క‌మ‌ల్‌కిదే చివరి చిత్రం

Kamal Haasan says this is his swan song
Wednesday, December 5, 2018 - 10:45

క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌.. ఇద్ద‌రూ పార్టీ ప్ర‌క‌ట‌న‌లు చేసి ఏడాది పైనే అయింది. ఐనా ఇద్ద‌రూ వ‌రుస‌గా సినిమాలు ఒప్పుకుంటూ, మేక‌ప్పుల‌తో క‌నిపిస్తుండ‌డంతో..అస్స‌లు వీరు సినిమాల‌కి ప్యాక‌ప్ చెపుతారా అన్న డౌట్స్ అంద‌రిలోనూ మొద‌ల‌య్యాయి. ర‌జ‌నీకాంత్ త్వ‌ర‌లో మురుగ‌దాస్ డైర‌క్ష‌న్‌లోనూ న‌టిస్తానంటున్నాడు.

ఐతే క‌మ‌ల్‌హాస‌న్ మాత్రం క్లారిటీ ఇచ్చాడు. "భారతీయుడు 2" సినిమా త‌ర్వాత ఇక‌పై సినిమాల్లో న‌టించ‌న‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు. ఇదే త‌న చివ‌రి చిత్రమ‌వుతుంద‌ని అంటున్నాడు. "భార‌తీయుడు 2" సినిమా త‌నకి రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే ఉద్దేశంతోనే ఒప్పుకున్నాడ‌ట‌. శంక‌ర్ తీస్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 14న ప్రారంభం కానుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌.

క‌మ‌ల్‌హాస‌న్ ఇటీవ‌ల న‌టించిన ఏ సినిమా కూడా పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. ఐతే శంక‌ర్ బ్రాండ్ త‌న‌కి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని క‌మ‌ల్ భావ‌న‌. అందుకే హిట్ సినిమాతో కెరియ‌ర్‌కి ఎండ్‌కార్డ్ వేస్తే బాగుంటుంద‌ని ఈ సినిమానే త‌న చివ‌రి చిత్రం అని అంటున్నాడు క‌మ‌ల్‌.