నాకు పెళ్లి కాకుండా చేశారు కంగనా

Kangana Ranaut makes strong allegations on Karan
Sunday, July 19, 2020 - 16:30

బాలీవుడ్ పెద్దలపై కంగనా రనౌత్ మరోసారి ఘాటుగా కామెంట్స్ చేసింది. వాళ్ళు పెద్దలు కాదు గద్దలు, అవుట్ సైడర్స్ ని పీక్కుతినే రాబందులు అని అర్ణబ్ గోస్వామి ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ని కడిగేసింది. వాళ్ళు ఒక సిస్టమాటిక్ గా బురద జల్లుతారు,  వెనక ఉండి చెయ్యాలిసింది అంతా చేస్తారు అని చెప్తోంది.

"నన్నే ఎగ్జామ్పులుగా తీసుకొండి. 'తను వెడ్స్ మను 2' తర్వాత నా గ్రాఫ్ పెరిగింది. అప్పుడు అనేక బ్రాండ్స్ నా చేతిలో ఉన్నాయి. సడెన్ గా హ్రితిక్ రోషన్ మ్యాటర్ ని బయటికి తీశారు. మగాళ్లని వలలో వేసుకునేదాన్ని అని ప్రచారం చేశారు. నింఫోమేనియక్ (సెక్స్ కోరికలు అధికంగా ఉండే స్త్రీ) అని ముద్ర వేశారు.   పిచ్చి దాని అని పుకారు పుట్టించారు. ఒక దశలో నాకు మొత్తంగా అన్ని దార్లు మూసుకునేలా చెయ్యడంలో వాళ్ళు విజయం సాధించిన మాట వాస్తవం," అని చెప్పింది కంగనా. 

"బాలీవుడ్ లో నెపోటిజమ్ గురించి నేను నిలదీస్తే ...అంత కష్టంగా ఉంటే బాలీవుడ్ నుంచి వెళ్ళిపో అని కరణ్ జోహార్ లండన్ లో ఒక పబ్లిక్ వేదికపై అన్నాడు. అది అతని గ్యాంగ్ మెంటాలిటీ. ఇప్పుడు మేము ఏమి తప్పు చేశామంటూ నంగనాచి కబుర్లు ఒలకబోస్తునాడు కరణ్," అంటూ ఉతికి ఆరేసింది. 

నన్ను నింపొమేనియాక్ అని ముద్ర వెయ్యడంతో... మా రిలేటివ్స్ వెలేశారు. సంబంధాలు రాకుండా చేశారు. అలా నాకు పెళ్లి కాకుండా అడ్డు పుల్లలు వేసిన అడ్డ గాడిదలు ఆ గ్యాంగ్, అంటూ బాలీవుడ్ పెద్దలను బట్టలు లేకుండా నిలబెట్టింది. 

మహేష్ భట్ ఒక రోగ్ అని చెప్పింది. అతను సినిమా చేసేందుకు రిజెక్ట్ చేశానని తనపై చెప్పు విసిరాడు మహేష్ భట్ అని పేర్కొంది కంగనా.