సుమ‌ల‌త భ‌ర్త అంబ‌రీష్ క‌న్నుమూత‌

Kannada actor Ambareesh passes away
Sunday, November 25, 2018 - 08:15

క‌న్న‌డ న‌టుడు అంబరీష్‌ (66)కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు అంబ‌రీష్‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఆయ‌న అంత‌గా ప‌రిచ‌యం లేదు. కానీ ఆయ‌న భార్య సుమ‌ల‌త తెలుగులో వెరీ పాపుల‌ర్‌. 

క‌న్న‌డంలో అనేక చిత్రాల్లో నటించిన అంబరీష్‌ కన్నడ రెబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.  సుమలతను 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అభిషేక్‌ ఉన్నారు. 200కు పైగా చిత్రాల్లో నటించి సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబరీష్‌. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన అంబరీష్‌ కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున మూడు సార్లు గెలుపొందారు.  2013లో సిద్దరామయ్య కేబినెట్‌లో ఆ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.