కార్తీ, రష్మిక జంటగా సినిమా

Karthi and Rashmika film announced
Sunday, February 24, 2019 - 20:45

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందనుంది. కార్తీ 19 వ సినిమా గా రూపొందుతున్న ఈ చిత్రంలో గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం సూర్య తో 'ఎన్ జీ కె' నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'రెమో' ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చ్ రెండవ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. 

ఇది ర‌ష్మిక‌కి తొలి తమిళ చిత్రం. ఇప్ప‌టికే ఆమె తెలుగులో అగ్ర హీరోయిన్‌గా కొన‌సాగుతోంది. మాతృభాష క‌న్న‌డంలోనూ ఆమెకి మంచి పాపులారిటీ ఉంది. ఇక ఇపుడు కోలీవుడ్ మార్కెట్‌పై క‌న్నేసింది.