'గీతా'తో కార్తికేయ గీత మారుతుందా?

Karthikeya begins Chavu Kaburu Challagaa
Friday, February 14, 2020 - 14:30

కార్తికేయ ఈ సారైనా మెప్పిస్తావా?

కార్తికేయ మరో సినిమా స్టార్ట్ చేశాడు. ఈసారి ఏకంగా గీతాఆర్ట్స్2పై సినిమా చేయబోతున్నాడు ఈ హీరో. ఇప్పటికే ఆర్ఎక్స్100లో పక్కా మాస్ క్యారెక్టర్ చేసిన ఈ హీరో, ఈసారి అంతకంటే డబుల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నాడు. అతడి క్యారెక్టర్ పేరు బస్తీ బాలరాజు. ఇంతకీ సినిమాలో అతడి క్యారెక్టర్ ఏంటో తెలుసా? సినిమాలో కార్తికేయ ఓ మార్చురీ వ్యాన్ డ్రైవర్. ఆ వ్యాను పేరు స్వర్గపురి వాహనం. పైగా దానికి ఏసీ కూడా పెట్టిస్తాడు.  తన ఇష్టదైవం గంగమ్మ తల్లి కాబట్టి, గంగమ్మ దీవెన అనే బోర్డ్ కూడా ఉంటుంది. దీనికి తోడు సినిమాలో చాలా భాగం లుంగీతోనే ఉంటాడు. ఇది చావు కబురు చల్లగా సినిమాలో కార్తికేయ గెటప్-సెటప్.

ఇక్కడ స్పెషల్ ట్విస్ట్ ఏంటంటే.. సినిమాలో కార్తికేయ పెద్దగా మాట్లాడడు. మార్చురీ వ్యాన్ లో ఎవరితో మాట్లాడాలి? కాబట్టి ఇతడికి అంతా నిర్లిప్తంగా ఉంటుంది. ఏ పని చేసినా నాకు సంబంధం లేదు అన్నట్టు చేస్తుంటాడు. కానీ ఒక్కసారి మార్చురీ వ్యాన్ దిగాడంటే.. ఆ బస్తీకి అతడే కింగ్. ఇలాంటి వేరియేషన్స్ సినిమాలో చాలా ఉంటాయి.

సినిమాలో బస్తీబాలరాజు పాత్రకు మార్చువీ  వ్యాన్ కు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కుటుంబానికి మంచి ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంటుంది. అక్కడ్నుంచే సినిమా పరుగులుపెడుతుంది. చెప్పుకోవడానికి ఇదంతా సీరియస్ వ్యవహారంలా అనిపించినా, మూవీ మొత్తం ఫుల్ ఫన్ తో సాగిపోతుందట.

ఆర్ఎక్స్100 తర్వాత నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తే ఒక్క దాంట్లోనూ మెప్పించలేకపోయాడు. హిట్ కొత్త లేక పోయాడు. మరి గీతా పుణ్యమా అని ఆయన గీత మారుతుందా?