కార్తీకి కలిసిరాని కొత్త ఏడాది

Karthi's Dev first day collection is bad
Friday, February 15, 2019 - 21:30

గతేడాదిని ఫ్లాపుతోనే ముగించిన కార్తి, ఈ ఏడాదినైనా ఓ హిట్ తో స్టార్ట్ చేయాలని బలంగా అనుకున్నాడు. కానీ విధి అంతకంటే బలీయంగా ఉంది. కార్తీ కెరీర్ ఈ ఏడాది కూడా ఫ్లాప్ తోనే మొదలైంది. రకుల్ తో కలిసి అతడు చేసిన "దేవ్" సినిమా బోర్ కొట్టేసింది. పబ్లిక్ టాక్ కు తగ్గట్టుగానే ఫస్ట్ డే వసూళ్లు కూడా అంతే ఘోరంగా ఉన్నాయి.

వరల్డ్ వైడ్ 28 కోట్ల రూపాయలకు "దేవ్" సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్మితే, మొదటి రోజు కేవలం 5 కోట్ల 71 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. కార్తి మార్కెట్ కు ఆయువుపట్టులాంటి తమిళనాడు నుంచి 3 కోట్ల 31 లక్షల రూపాయల షేర్ రాగా, తెలుగు రాష్ట్రాల నుంచి అటుఇటుగా కోటి 20 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది. 

కార్తి సినిమాల్లో ఏమున్నా లేకపోయినా మంచి పాయింట్ ఉంటుందనే నమ్మకం ఉంది జనాల్లో. ఆమధ్య వచ్చిన చినబాబు సినిమాతో అది కాస్త తగ్గింది. "దేవ్" సినిమాతో పూర్తిగా పోయింది. ఈ హీరో నెక్ట్స్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకులముందుకొస్తాడో చూడాలి.