ఇక హిందీలో ఖైదీ రీమేక్

Karthi's Khaidi getting remade in Hindi
Monday, February 3, 2020 - 17:15

కార్తీ నటించిన 'ఖైదీ' సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి యాక్షన్ థ్రిల్లర్ రాలేదు అని క్రిటిక్స్ ముక్త కీబోర్డుతో అనౌన్స్ రాశారు. సినిమాలో హీరోకి లవర్ రాలేదు, డ్యూయెట్ లేదు, గ్లామర్ లేదు, నాన్ స్టాప్ యాక్షన్ తప్ప. చివరి వరకు గ్రిప్పింగ్ గా సాగిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో తెరకెక్కనుంది. ఖైదీ ని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు రిలయన్స్ ఎంటర్ టెయిన్మెంట్ ప్రకటించింది. 

రీసెంట్ గా తెలుగులో హిట్టయిన 'అర్జున్ రెడ్డి' ని హిందీ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తే కళ్ళు చెదిరే కలెక్షన్లు వచ్చాయి. అలాగే ఇప్పుడు 'జెర్సీ' రీమేక్ అవుతోంది. అదే పంథాలో ఖైదీ రీమేక్ హక్కులను తీసుకున్నారు. 

తమిళ్లో డైరెక్ట్ చేసిన లోకేష్ కనగరాజ్ ఈ హిందీ వర్సన్ ని డైరెక్ట్ చేస్తారు. హీరో ఎవరు అనేది ఇంకా కంఫర్మ్ కాలేదు.