హీరోయిన్లపై కార్తికేయ హాట్ కామెంట్స్

Kartikeya talks about heroines
Tuesday, May 12, 2020 - 16:15

హీరోయిన్ల గురించి సామాన్య జనం రకరకాలుగా అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ల కామెంట్స్ కాస్త హాట్ గానే ఉంటాయి. మరి అదే హీరోయిన్ల గురించి మరో హీరో హాట్ గా కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి సందర్భమే ఇది.

పేరుపేరునా హీరోయిన్స్ పై ఘాటైన కామెంట్స్ చేశాడు హీరో కార్తికేయ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ ఆర్ఎక్స్100 హీరో.. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ నుంచి టాలీవుడ్ కు చెందిన పూజాహెగ్డే వరకు చాలామందిపై తన అభిప్రాయాన్ని మనసులో ఉన్నది ఉన్నట్టు కక్కేశాడు. హీరోయిన్లపై కార్తికేయ రియాక్షన్ ఎలా ఉందో చూసేయండి.

పూజా హెగ్డే - ఆమె పేరు చెప్పగానే ఆమె కాళ్లే గుర్తొస్తాయి. నాక్కూడా ఆమె లెగ్స్ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.

దీపిక పదుకోన్ - ఆమె నా డ్రీమ్ గర్ల్. చాన్నాళ్లు ఆరాధించాను. ఇప్పుడు రణ్వీర్ సింగ్ ను చూసి కుళ్లుకుంటున్నాను.

పాయల్ రాజ్ పుత్ - నేను తనను చాలా మిస్ అవుతున్నాను. చాలా గ్యాప్ వచ్చింది. మాట్లాడి చాలా రోజులైంది. ఆల్రెడీ కలిసి వర్క్ చేశాం కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగుండదు.

రష్మిక - ఈమెలో హాట్ నెస్ నాకు కనిపించదు. క్యూట్-స్వీట్ గా ఉంటుంది. బబ్లీ గర్ల్.

కీర్తిసురేష్ - ఇప్పుడు సన్నగా అయిపోయింది. నాకు అప్పుడే నచ్చింది. ఛబ్బీగా ఉండేది. ఆ బుగ్గలైతే.. వద్దులెండి.