విజయ నిర్మలగా నటించట్లేదు

Keerthy is not playing Vijaya Nirmala's role
Wednesday, April 29, 2020 - 17:00

ఎవరైనా ఒక పాత్రతో హిట్ కొట్టారంటే, ఇక వాళ్లకు వరుసగా అలాంటి పాత్రలే వస్తుంటాయి. సదరు నటి లేదా నటుడ్ని మరో కోణంలో చూపిద్దామనే ఆలోచన అస్సలు ఉండదు. ఇప్పుడు కీర్తిసురేష్ పరిస్థితి కూడా ఇలానే తయారైంది. ఏ ముహూర్తాన మహానటి సినిమా చేసిందో కానీ, అప్పట్నుంచి ఆమెకు అన్నీ బయోపిక్ ఆఫర్లే వస్తున్నాయి. ఇదే క్రమంలో విజయ నిర్మల బయోపిక్ లో కూడా ఆమె నటించబోతోందంటూ కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి.

విజయనిర్మల తనయుడు వీకే నరేష్ ఈ రూమర్లను ఖండించాడు. తన తల్లి బయోపిక్ కోసం కీర్తిసురేష్ ను సంప్రదించామనే న్యూస్ లో ఎలాంటి నిజం లేదంటున్నాడు నరేష్. విజయనిర్మల బయోపిక్ కోసం తమ కుటుంబసభ్యులు ఎవ్వరూ ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేశాడు. అంతేకాదు.. గతంలో తల్లితో కలిసి ఆమె బయోపిక్ కు సంబంధించి స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేశానని, ఆ తర్వాత అది కుదరలేదనే విషయాన్ని కూడా నరేష్ చెప్పుకొచ్చారు.

అటు కీర్తిసురేష్ కు కూడా ఇప్పటికిప్పుడు బయోపిక్స్ లో నటించే ఉద్దేశం లేదు. ఇదే విషయాన్ని ఆమె పలుమార్లు ప్రస్తావించింది. సో.. విజయనిర్మల బయోపిక్ తెరపైకి రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదేమో.

|

Error

The website encountered an unexpected error. Please try again later.