బికినీ కోసమే స్లిమ్ అయిందా?

Keerthy Suresh slims for bikini
Saturday, May 9, 2020 - 17:30

బికినీ వేయాలంటే ఫిజిక్ పెర్ ఫెక్ట్ గా ఉండాలి. సైజ్ జీరో ఫిజిక్ లో బికినీ బ్రహ్మాండంగా సూట్ అవుతుంది. హీరోయిన్లంతా బికినీల కోసం కాకపోయినా తమ అందం కోసం స్లిమ్ గా మారుతుంటారు. కీర్తిసురేష్ మాత్రం కేవలం బికినీ కోసమే స్లిమ్ గా మారిందంటూ పుకార్లు వచ్చాయి. వీటిపై కీర్తిసురేష్ స్పందించింది.

బికినీ ధరించడం కోసమే తను స్లిమ్ గా మారాననే వార్తల్ని కీర్తిసురేష్ ఖండించింది. బరువు తగ్గాలనే నిర్ణయం ఇప్పటికి కాదని, ఆ ప్రయత్నం కూడా సెడన్ గా చేసింది కాదంటోంది. దాదాపు ఏడాదిగా కష్టపడి స్లిమ్ లుక్ లోకి మారానంటోంది. ఇక బికినీ కోసమే స్లిమ్ గా మారాననే అంశంపై స్పందిస్తూ.. నిజానికి తనకు అలాంటి ఆఫర్ వచ్చిందని, ఓ బడా సినిమాలో ఆఫర్ వచ్చినప్పటికీ.. బికినీలో కనిపించాలనే కండిషన్ కు అంగీకరించక తప్పుకున్నట్టు స్పష్టంచేసింది. ఆ భారీ బడ్జెట్ సినిమా ఏంటనే విషయాన్ని మాత్రం కీర్తిసురేష్ వెల్లడించలేదు.

కీర్తిసురేష్ కు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినప్పుటు ఆమధ్య ప్రచారం జరిగింది. బహుశా ఆ ఆఫర్లలో భాగంగానే ఈ బికినీ ఆఫర్ కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే తెలుగు నుంచి ఆమెకు ఇలాంటి బికినీ ఆఫర్లు ఇచ్చేంత సాహసం ఎవ్వరూ చేయరు. ఎందుకంటే ఆమెకు తెలుగులో "మహానటి" ఇమేజ్ ఉంది.