అచ్చంగా సావిత్రిలా మారిపోయిందే!

Keerthy Suresh's make up as savitri
Tuesday, May 30, 2017 - 16:45

వెండితెరపై నిండైన రూపం సావిత్రి. కళ్లతో ఆమె పలికించే భావాల్ని ఎవర మరిచిపోలేరు. అలాంటి సావిత్రి మరోసారి మనల్ని పలకరించనుంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అలరించబోతోంది. అవును.. కీర్తి సురేష్ అచ్చంగా సావిత్రిలా మారిపోయింది. పాత సినిమాల్లో సావిత్రి ఎలా ఉంటుందో, కీర్తి సురేష్ ను అలాగే తయారుచేశారు. అలాంటి స్టెప్పులే కంపోజ్ చేశారు. మ్యూజిక్ కూడా సేమ్ పాత తరం సంగీతమే. ఈ మొత్తం సెటప్ మొత్తం మహానటి సినిమా కోసం రెడీ అయిపోయింది.

నిన్నట్నుంచి ప్రారంభమైంది మహానటి రెగ్యులర్ షూటింగ్. ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ పై ఓ సోలో సాంగ్ పిక్చరైజ్ చేశారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సావిత్రి గెటప్ కోసం అలనాటి డిజైన్స్ తో ప్రత్యేకంగా చీరలు చేయించారు. మేకప్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషించబోతున్నాడు. సెకెండ్ షెడ్యూల్ లో భాగంగా జూన్ 15 నుంచి కీర్తి-దుల్కర్ మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తీయబోతున్నారు. సమంత ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనుంది. సమంతకు బాయ్ ఫ్రెండ్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.