దసరాకి "కెజిఎఫ్ 2" వచ్చేనా?

KGF2, will it make it to Dasara?
Thursday, April 9, 2020 - 14:00

దసరా కానుకగా అక్టోబర్ 23న రిలీజ్ చేస్తామని ప్రకటించింది "కెజిఎఫ్ 2"టీం. కానీ ఇప్పుడు డౌట్స్ మొదలు అయ్యాయి. కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగులు ఆగిపోయాయి. హాలీవుడ్ ...తన పెద్ద సినిమాలు అన్నింటిని వచ్చే ఏడాదికి పోస్టుపోన్ చేసింది. బాలీవుడ్ లోనూ అదే జరుగుతోంది. టాలీవుడ్ లో కూడా చాలా మార్పులు జరగనున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ పెద్ద సినిమాల్లో కొన్ని దసరాకు మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అప్పుడు "కెజిఎఫ్ 2" దసరాకి పోటీ పడుతుందా?

ఎందుకంటే ఈ సినిమా ...పాన్ ఇండియన్ మూవీ. భారీ అంచనాలున్నాయి. అన్ని భాషల్లో పెద్ద ఎత్తున విడుదల కానుంది. థియేటర్లు కావాలి. సో... బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల డేట్స్ ని చూసి "కెజిఎఫ్ 2" తన రిలీజ్ డేట్ ని షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంది. 

దసరాకి వస్తుందా రాదా అన్నది తేలాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.