మొదట 30 లక్షలు.. ఏడో రోజుకి రూ.5 కోట్లు

Khaidi is a hit
Saturday, November 2, 2019 - 07:00

మౌత్ టాక్ బలంగా ఉంటే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించింది ఖైదీ సినిమా. ఈమధ్య కాలంలో ఇలా కేవలం మౌత్ టాక్ తో ఆడిన సినిమా ఇంకోటి లేదు. టీవీల్లో యాడ్స్ ఇస్తున్నప్పటికీ వాటిని జనం పట్టించుకోలేదు. కేవలం జనాలు, మీడియా బాగుందని చెప్పడంతోనే ఖైదీకి వసూళ్లు వస్తున్నాయి. మొదటి రోజు 30 లక్షల రూపాయల షేర్ తో అత్యల్పంగా కనిపించిన ఖైదీ సినిమా.. వారం పూర్తయ్యేసరికి కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టింది.

అవును.. నిన్నటితో 7 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు అక్షరాలా 5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు 30 లక్షలకు, వారం రోజుల్లో 5 కోట్లకు అస్సలు పొంతన అనిపించడం లేదు కదా. కానీ ఇది నిజం. మౌత్ టాక్ గొప్పదనం ఇది. ఖైదీ సినిమా వారం రోజులకే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక ఇవాళ్టి నుంచి వచ్చిన వసూళ్లు దీనికి లాభం కిందే లెక్క.

కార్తి చేసిన లాస్ట్ 3 సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయ్యాయి. మరీ ముఖ్యంగా తాజా చిత్రం దేవ్ అయితే ఓ పెద్ద డిజాస్టర్. అందుకే ఖైదీ సినిమా హక్కుల్ని తక్కువ రేటుకు దక్కించుకోగలిగారు నిర్మాత రాధామోహన్. అలా తక్కువ రేటుకు దక్కించుకున్న రాధామోహన్, సినిమాను తక్కువ రేట్లకే అమ్మారు. దీంతో ఇప్పుడు అంతా 7 రోజుల్లోనే బ్రేక్-ఈవెన్ అయిపోయారు. బయ్యర్లు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సినిమా లేకపోవడంతో.. మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఖైదీ సినిమా ఆడుతుందని భావిస్తున్నారు.