నా ఇడ్లీ నేను తినలేదు

Khushbu says she never tasted idly named after her
Saturday, January 4, 2020 - 11:00

ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో చిరంజీవి దోశ ఫేమస్. చాలా రెస్టారెంట్లలో చిరంజీవి దోశ మెనూలో కనిపిస్తుంది. అలాగే తమిళనాడులో కూడా చాలా ప్రాంతాల్లో ఖుష్బూ ఇడ్లీ ఫేమస్. చెన్నై, పాండిచ్చేరిలో ఖుష్బు ఇడ్లీ ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. దీనిపై చాలా ఫన్నీగా రియాక్ట్ అయింది ఖుష్బూ.

"అవును.. నన్ను చూసే ఆ ఇడ్లీకి నాపేరు పెట్టారు. మా ఏరియాలో అవి చాలా ఫేమస్ అని విన్నాను. కానీ నేనెప్పుడు తినలేదు. ఎఁదుకంటే నాకు ఇడ్లీ అంటే పడదు. నిజానికి నేను వంటలు బాగా చేస్తాను. ఇడ్లీ కూడా బాగా చేస్తాను. కానీ నాకు మాత్రం ఎవ్వరూ ఖుష్బూ ఇడ్లీ తెచ్చి ఇవ్వలేదు."

ఇలా తన పేరిట ఉన్న ఇడ్లీపై రియాక్ట్ అయింది ఖుష్బూ. కేవలం ఇడ్లీతోనే తన అభిమానులు ఆగలేదంటోంది ఖుష్బూ. జుంకాలు, చీరలు, బ్లౌజులు.. ఇలా చాలా ఐటెమ్స్ కు తన పేరు పెట్టారని అన్నారు. తన పేరిట తమిళనాట ఏకంగా గుడి కట్టారని, ఆ షాక్ ముందు ఇవన్నీ చాలా చిన్నవని చెప్పుకొచ్చారు. గుడి కట్టే టైమ్ లో తనకు తమిళ్ రాదని, ఆ టైమ్ లో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, రెండేళ్ల తర్వాత అది ఎంత పెద్ద విషయమో తనకు అర్థమైందంటోంది ఖుష్బూ.