బాయ్‌ఫ్రెండ్‌తో సెట్‌లో చిందులు

Kiara Advani dating Siddharth Malhotra
Sunday, May 12, 2019 - 00:15

"భ‌ర‌త్ అనే నేను", "విన‌య విధేయ రామ" చిత్రాల భామ కియ‌రా అద్వానీ బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో డేటింగ్ చేస్తోంద‌నేది టాక్‌. అబ్బే అలాంటిదేమీ లేదంటోంది కియ‌రా. కానీ వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న కెమిస్ట్రీ చెప్ప‌క‌నే చెపుతోంది ఇదే ఇదే డేటింగ‌ని. 

వెరీ రీసెంట్‌గా వీరిద్ద‌రూ ఒక సినిమా మొద‌లుపెట్టారు. పవ‌న్‌క‌ల్యాణ్‌తో పంజా సినిమా తీసిన విష్ణువ‌ర్ధ‌న్ త‌న తొలి ప్ర‌య‌త్నంగా బాలీవుడ్‌లో ఒక బ‌యోపిక్ తీస్తున్నాడు. "షేర్‌షా" పేరుతో కార్గిల్ హీరో విక్ర‌మ్ బాత్రా బ‌యోపిక్ రూపొందుతోంది. ఇందులో సిద్దార్థ్ కార్గిల్ హీరోగా న‌టిస్తుండ‌గా, ఆయ‌న ప్రియురాలిగా కియ‌రా న‌టిస్తోంది. 

క‌ర‌ణ్ జోహ‌ర్ సినిమాని నిర్మిస్తున్నాడు. రియ‌ల్ లైఫ్ ప్రేమికుల‌తో సినిమాలు తీయ‌డం, వారి లవ్‌లైఫ్‌ని త‌న సినిమా ప్ర‌మోష‌న్‌కి వాడుకోవ‌డం క‌ర‌ణ్ జోహ‌ర్ శైలి. అందుకే కియ‌రా డేటింగ్ గురించి క‌న్‌ఫ‌మేష‌న్ వ‌చ్చిన‌ట్ల‌యింది