ఆ సినిమాలో కియరా లేదు!

Kiara Advani not in Chandramukhi 2
Monday, August 3, 2020 - 13:00

ముందు జ్యోతిక అన్నారు. ఆ తర్వాత సిమ్రాన్ పేరు తెరపైకొచ్చింది. ఇప్పుడేమో కియరా అద్వానీ పేరు ప్రచారంలోకి తెచ్చారు. "చంద్రముఖి" సీక్వెల్ కు సంబంధించి ఇలా రోజుకో పేరు వినిపిస్తోంది. లారెన్స్ హీరోగా రాబోతున్న ఈ ప్రెస్టీజియస్ సీక్వెల్ కు సంబంధించి చిన్నపాటి క్లారిటీ వచ్చింది. అది కూడా లారెన్స్ నుంచే.

తన సినిమాలో ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు లారెన్స్. మరీ ముఖ్యంగా అందరూ చెబుతున్నట్టు జ్యోతిక, సిమ్రాన్, కియరా అద్వానీలో ఏ ఒక్కరు లాక్ అవ్వలేదని స్పష్టంచేశాడు. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమాలో హీరోయిన్ ఎవరనేది చెప్తాడట.

పి.వాసు దర్శకత్వంలో రాబోతున్న ఈ సీక్వెల్ పనులు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయని ప్రకటించాడు లారెన్స్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ మూవీ.