ఆ ఛాన్స్ వస్తే బాగుండు!

Kiara's dream wish is
Sunday, May 10, 2020 - 18:45

కియారా అద్వానీకి కొన్ని కోరికలున్నాయి. ఒకటి రణ్వీర్ సింగ్ తో నటించాలనేది. రణ్వీర్ సింగ్ అంటే చాలా ఇష్టమంట. ఆ ఛాన్స్ రావాలని కోరుకుంటోంది. దాంతో పాటు మరో కోరికని కూడా బయటపెట్టింది. అదేంటంటే... ప్రియాంక చోప్రాలా అమెరికన్ సీరియల్ లో నటించాలనేది బలమైన విష్. అమెరికన్ సీరియల్ లో నటించి ప్రియాంక ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారింది. అమెరికన్ సింగర్ ని పెళ్లాడింది. 

కియారాకి కూడా అమెరికన్ సీరియల్స్ అంటే పిచ్చి. అందుకే ఒక్క దాంట్లో అయినా అవకాశం వస్తే బాగుండు అని చెప్తోంది.

కియారా అద్వానీ ప్రస్తుతం నాలుగు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. అన్ని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. థియేటర్లు మళ్లీ ప్రారంభం అయితే  వరుసగా ఆమె సినిమాలు వస్తాయి.