ఎవరు ఈ మిహీక బజాజ్?

Know more about Mihika Bajaj
Tuesday, May 12, 2020 - 21:45

రానా దగ్గుబాటిని మిహీక ని పెళ్ళి  చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ ఎవరు ఈ మిహీక బజాజ్? హైదరాబాద్ లో క్రశాల నగల స్టోర్ తెలియని వారుండరు. రిచ్ అండ్ ఫేమస్ పీపుల్ నగలు కొనే సంస్థ. వెంకటేష్, అనుష్క నటించిన నాగవళ్లి సినిమాకి నగలు అందించింది ఈ షో రూమ్. ఆ కుటుంబానికి చెందిన అమ్మాయే మిహీక.

లండన్ లో చదువుకొని వచ్చిన మిహీకకి వెంకటేష్ కూతుళ్ళ ద్వారా పరిచయం అయిందట. ఆమెకి సొంతంగా ఒక ఈవెంట్ కంపెనీ కూడా ఉంది. డ్రూ డ్రాప్ డిజైన్ అనే స్టూడియోని నడుపుతోంది. ఆమె సోదరుడికి ముంబైలో వ్యాపారాలు ఉన్నాయి. మహిక అటు ముంబై, ఇటు హైదరాబాద్ అన్నట్లుగా వ్యాపారాలు నిర్వహిస్తూ  బిజీగా ఉంటుంది. రానా కూడా అంతే కదా. తెలుగు, తమిళ్, హిందీ ...ఇలా అన్ని భాషల్లో నటిస్తుంటాడు. హైదరాబాద్, చెన్నై, ముంబై ....ఇలా చక్కర్లు కొడుతుంటాడు.

త్రిషతో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కూడా చాన్నాళ్లు రానా సీరియస్ సింగల్ గానే ఉన్నాడు. గత రెండేళ్లుగా మిహీకతో డేటింగ్ మొదలైందిట. ఐతే, రానా మాత్రం ఈ విషయాన్నీ తన తల్లితండ్రులు సురేష్ బాబు, లక్ష్మి దగ్గుబాటికి మిహీక గురించి మొన్నటివరకు చెప్పలేదట. రెండు రోజుల క్రితం విషయం చెప్పక రానా ఫామిలీ కొంత షాక్ తిన్నదట. కానీ రానా ఇష్టపడ్డ అమ్మాయికే అందరూ ఒకే చెప్పారంట. ఆలా అఫిషయల్ గా ఈరోజు రానా మిహీకని పెళ్లాడబోతున్నట్లు ప్రకటించాడు.