వయసు 28.. ఆస్తి 28 కోట్లు

Know the value of Kiara Adavani's assets
Friday, July 31, 2020 - 16:15

కియరా అద్వానీ.. కెరీర్ స్టార్ట్ చేసి జస్ట్ ఆరేళ్లు మాత్రమే అయింది. అయితేనేం ఈ 6 ఏళ్లలో ఎంతో క్రేజ్ తో పాటు మరెంతో ఆస్తి సంపాదించుకుంది. ఈరోజు ఈ అమ్మడు తన 28వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమె సంపాదనపై సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి డిస్కషన్ నడుస్తోంది

కియరా అద్వానీకి ప్రస్తుతం 28 కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చని ఓ అంచనా. "లస్ట్ స్టోరీస్" ముందు వరకు ఆమెకు పెద్దగా పారితోషికం అందలేదు. అంతకంటే ముందు ఆమె చేసిన సినిమాలు కూడా తక్కువే. ఎప్పుడైతే "లస్ట్ స్టోరీస్" హిట్ అయిందో.. ఆ వెంటనే ఇటు తెలుగులో అటు హిందీలో చకచకా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

అలా ఇప్పటివరకు చేసిన సినిమాలతో పాటు యాడ్స్, స్పెషల్ ప్రమోషన్స్ తో కలిపి కియరా.. 28 ఏళ్లు వచ్చేటప్పటికే 28 కోట్లు సంపాదించిందనే ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఈ ఏడాదికి సంబంధించి మరో 4 సినిమాలు లైన్లో ఉన్నాయి. వాటి పారితోషికాలు కూడా కలుపుకుంటే లెక్క కనీసం 35 కోట్లకు చేరుతుందని అంటున్నారు.

మరోవైపు కియరా అద్వానీ తన పుట్టినరోజును ఇంట్లోనే తల్లిదండ్రుల మధ్య సెలబ్రేట్ చేసుకుంటోంది. వాటికి సంబంధించిన పిక్స్ ను కూడా ఆమె షేర్ చేసింది.