అనుష్కకు ఫ్లయిట్ లో కథ చెప్పాడట

Kona narrated story to Anushka in flight
Tuesday, December 3, 2019 - 07:00

నిశ్శబ్దం సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ను ఆడియన్స్ తో షేర్ చేసుకున్నాడు కోన వెంకట్. ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్, అసలు నిశ్శబ్దం సినిమాకు అనుష్కను హీరోయిన్ గా అనుకోలేదని ప్రకటించి పెద్ద బాంబ్ పేల్చాడు.

అవును.. నిశ్శబ్దం సినిమాకు మరో హీరోయిన్ ను అనుకున్నారంట. ఆమె ఓకే కూడా చెప్పి, కాల్షీట్లు కూడా ఇచ్చిందట. కథ ప్రకారం సినిమాను అమెరికాలో షూట్ చేయాలి. కానీ వీసాలు రావడం లేట్ అయింది. ఈలోగా ఆ పెద్ద హీరోయిన్ కాల్షీట్లు అయిపోయాయి. దీంతో ఆమె కాల్షీట్లు సర్దుబాటు చేయలేక తప్పుకుందట.

కట్ చేస్తే, ఓసారి సాంకేతిక కారణాల వల్ల హైదరాబాద్ లో దిగాల్సిన విమానాన్ని దారిమళ్లించి చెన్నైకు తీసుకెళ్లారట. అప్పుడు అదే ఫ్లయిట్ లో కోనవెంకట్, అనుష్క ప్రయాణిస్తున్నారట. ఆ జర్నీలో అనుష్కకు నిశ్శబ్దం కథ చెప్పడం, ఆమె అక్కడికక్కడే ఓకే చెప్పడం అయిపోయాయట.

అలా నిశ్శబ్దం సినిమాలోకి అనుష్క వచ్చిందంటున్నాడు కోన వెంకట్. అయితే అనుష్క కంటే ముందు యూనిట్ అనుకున్న హీరోయిన్  ఎవరనేది మాత్రం కోన చెప్పలేదు. మీడియా మిత్రులు మాత్రం కీర్తిసురేష్ అంటూ గుసగుసలాడుకున్నారు.