మళ్ళీ కోన డైరక్షన్

Kona Venkat to turn director again
Wednesday, April 1, 2020 - 14:00

మరోసారి డైరెక్టర్ గా అవతారమెత్తనున్నాడు రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్. అయన గతంలో మాధవన్ హీరోగా ఒక మూవీ తీశాడు కానీ అది విడుదలకి నోచుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత డైరక్షన్ చేయాలని అనుకుంటున్నాడు. త్వరలోనే తన దర్శకత్వంలో సినిమా మొదలవుతుంది అని చెప్పాడు. 

అయన గత కొంతకాలంగా సినిమాల ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. కోన ఫిలిమ్స్ బ్యానర్ పై నిన్ను కోరి, గీతాంజలి, నిశ్శబ్దం వంటి సినిమాలకి ప్రెజంటర్ గా ఉన్నారు. డైరక్షన్ చెయ్యాలనేది ఆయన కల. అన్నట్లు నిశ్శబ్దం సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.