కొరటాలకి 100 రోజుల డెడ్ లైన్

Koratala gets 100 days deadline
Monday, January 6, 2020 - 14:15

అపజయాలు లేకుండా వెళ్తోన్న శివ కొరటాలకి పెద్ద ఛాలెంజే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని పబ్లిక్ గా బుక్ చేశారు మరి.

"పెద్ద సినిమాలు ఎంత స్పీడుగా పూర్తి చేస్తే నిర్మాతకి అంతా మంచిది. 100 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేస్తే నిర్మాతకి ఖర్చు పరంగా, పెట్టుబడి కోసం తెచ్చిన ఫైనాన్స్ పై వడ్డీ బాగా కలిసి వస్తుంది. మా సినిమాని 90 రోజుల్లోనే పూర్తి చేస్తాను అని శివ కొరటాల మాటిచ్చారు," అంటూ చిరంజీవి పబ్లిక్ గా చెప్పారు. అంతేకాదు, కొరటాలని పిలిచి మరీ, "అవును" అని ఆయనతో అనిపించారు. 

ఇప్పుడు 100 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చెయ్యడం కొరటాల పని. ఆలా పబ్లిక్ గా కమిట్ చేయించారు కాబట్టి కొరటాల చచ్చుకుంటూ చేయాల్సిందే. కొరటాల - చిరంజీవి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతోంది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలు. ఆగస్టు లో రిలీజ్ చెయ్యాలనేది ప్లాన్. ఇంకా ఏడు నెలల టైం ఉంది కాబట్టి మెల్లగా చెయ్యొచ్చు. అయితే కొరటాల మరీ స్పీడ్ గా తెస్తే జూన్ లోనే రిలీజ్ చేస్తారు.