అవును.. నేను తాగి నటించాను

Kota Srinivasa Rao confesses he drunk on sets
Wednesday, July 15, 2020 - 18:45

కోట శ్రీనివాసరావుపై చాన్నాళ్లుగా ఓ రిమార్క్ ఉంది. ఆయన చాలాసార్లు సెట్స్ కు తాగి వస్తారనేది ఆ ఆరోపణ. ఇది నిజమని కచ్చితంగా చెప్పేవాళ్లు లేరు, అలా అని ఖండించిన వాళ్లు కూడా లేరు. ఎట్టకేలకు ఈ అంశంపై స్వయంగా కోట శ్రీనివాసరావే స్పందించారు. తను తాగి సినిమాల్లో నటించిన సందర్భాలున్నాయని కుండబద్దలుకొట్టారు ఈ సీనియర్ నటుడు.

తన కెరీర్ లో దాదాపు పాతిక సినిమాల వరకు తను తాగి నటించానని ఒప్పుకున్నాడు కోట. అయితే ఇక్కడ కూడా ఆయన తనదైన వాదన వినిపించారు. కేవలం తనకు డైలాగ్ వెర్షన్ లేనప్పుడు మాత్రమే తాగేవాడినని చెప్పుకొచ్చారు.

కొన్ని సీన్లలో కోట కనిపించాలి, కానీ ఆయనకు డైలాగ్స్ ఉండవు. అలాంటి టైమ్ లో తాగి నటించేవాడినని ఒప్పుకున్నారు. పైగా తను తాగి నటించిన సన్నివేశాలన్నీ చాలా చలిలో తీసినవని.. తను ఒక పెగ్గు వేయకపోతే నటించలేనని దర్శకులకు చెప్పి, వాళ్ల అనుమతితోనే తాగేవాడినని అన్నారు కోట శ్రీనివాసరావు.