పీకల్లోతు ప్రేమలో తీన్మార్ సుందరి

Kriti Kharbanda in deep love with Pulkit
Wednesday, November 20, 2019 - 11:00

తీన్ మార్ సినిమాలో నటించిన కృతి కర్బందా గుర్తుందా.. ఆ తర్వాత ఆమె బ్రూస్ లీ సినిమాలో చరణ్ కు అక్కగా కూడా నటించింది. ఎస్.. ఆ కృతి కర్బందా ఇప్పుడు ప్రేమలో పడింది. తన లవ్ మేటర్ బయటపెట్టింది. నటుడు పుల్ కిత్ సామ్రాట్ తో తను డేటింగ్ లో ఉన్నట్టు స్వయంగా ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ.

నిజానికి వీళ్లిద్దరూ కొత్తగా ప్రేమలో పడలేదు. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మీడియా కూడా ఈ విషయాన్ని పసిగట్టింది. కానీ వీళ్లిద్దరూ ఆ విషయాన్ని నిర్థారించలేదు. తాజాగా తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారట వీళ్లిద్దరూ. ఆ తర్వాతే మీడియాకు చెప్పాలని నిర్ణయించుకున్నారు.

మరో 2 రోజుల్లో "పాగల్ పంతి" అనే సినిమా రిలీజ్ అవుతోంది. ఇందులో అనీల్ కపూర్, జాన్ అబ్రహాం, ఇలియానా లాంటి నటులతో పాటు కృతి కర్బందా, పులకిత్ సమ్రాట్ కూడా నటించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే తన లవ్ మేటర్ ను బయటపెట్టింది కృతి కర్బందా. తెలుగులో సుమంత్ నటించిన "బోణి" సినిమాతో హీరోయిన్ గా మారింది కృతి. ఆ తర్వాత "ఒంగోలుగిత్త", "ఓం" త్రీడీ, "మిస్టర్ నూకయ్య" లాంటి సినిమాలు చేసింది.

కాకపోతే టాలీవుడ్ లో ఆమె కెరీర్ సజావుగా సాగలేదు. కానీ ఊహించని విధంగా బాలీవుడ్ లో ఈ బ్యూటీ క్లిక్ అయింది.