పంద్రాగస్ట్ నాడు కియారా 'బాంబ్'

Laaxmi Bomb to release on August 15
Tuesday, June 16, 2020 - 13:00

థియేటర్లను మిస్ కొట్టి ఇప్పటివరకు చాలా సినిమాలు ఓటీటీపైకి వచ్చాయి. కానీ అతిపెద్ద మూవీ త్వరలోనే ఓటీటీపైకి రాబోతోంది. దీని పేరు "లక్ష్మీ బాంబ్". అక్షయ్ కుమార్, కియరా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతోందనే విషయం తెలిసిందే. ఇప్పుడా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

పంద్రాగస్ట్ కానుకగా "లక్ష్మీబాంబ్" ను స్ట్రీమింగ్ కు పెట్టడానికి నిర్ణయించింది డిస్నీ హాట్ స్టార్. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను దాదాపు 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన ఈ సంస్థ.. ఓ స్ట్రయిట్ మూవీని ప్రమోట్ చేసినట్టు "లక్ష్మీబాంబ్" కు ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. ఈ మూవీకి సంబంధించి ప్రెస్ మీట్లు, లొకేషన్ టూర్స్, ఛానెల్ ఇంటర్వ్యూలు.. ఇలా అన్నీ ఉంటాయన్నమాట.

జులై చివరి వారం నాటికి ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఆగస్ట్ 15 వీకెండ్ పడింది. పైగా హాలిడేస్ కూడా కలిసొస్తాయి. అందుకే తమ సినిమాకు ఆగస్ట్ 15ను లాక్ చేసింది. వచ్చే నెల నుంచి డిస్నీకి చెందిన అన్ని ఛానెల్స్ లో ఈ సినిమా ప్రోమోలు టెలికాస్ట్ కాబోతున్నాయి.

తెలుగులో వచ్చిన "కాంచన" సినిమాకు రీమేక్ ఇది. లారెన్స్ దర్శకుడు.