ఉన్నది ఒకటే సినిమా

లావణ్యకి మంచి క్రేజుంది. "అందాల రాక్షసి" నుంచి రీసెంట్‌గా వచ్చిన "యుద్దం శరణం" వరకు తన యాక్టింగ్‌తో, క్యూట్ లుక్స్‌తో అందర్నీ మెప్పించింది. అయితే ఇపుడు లావణ్య చేతిలో ఉన్న చిత్రమొకటే. అదే "ఉన్నది ఒకటే జిందగీ". కొత్తగా ఆమె ఇంకా సినిమాలు సైన్ చేయలేదు. దానికి తోడు ఆమె ఇటీవల చేసిన సినిమాలన్నీ ఢమాల్.
రామ్ నటించిన "ఉన్నది ఒకటే జిందగీ"తో తన కెరియర్ మళ్లీ పుంజుకుంటుందని నమ్మకంగా ఉంది ఈ బ్యూటీ. హైదరాబాద్‌నే సొంతూరుగా మలుచుకున్న లావణ్య కెరియర్ బ్రైట్‌గా సాగాలని కోరుకుందాం. అన్నట్లు ఈ భామ ఇపుడు గ్లామర్ షోకి కూడా సై అంటోంది. రీసెంట్‌గా అలాంటి ఫోటోలనే ఎక్కువగా షేర్ చేస్తోంది.
"ఉన్నది ఒకటే జిందగీ" ఈ వీకెండ్ (అక్టోబర్ 27) విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ, లావణ్య హీరోయిన్లుగా నటించారు.
- Log in to post comments