హైదారాబాదే బెస్ట్ : లావ‌ణ్య‌

Lavanya planning to buy villa in Hyderabad
Tuesday, January 16, 2018 - 14:15

హైద‌రాబాద్‌..వ‌ర్క్‌ చేయ‌డానికే కాదు, హాయిగా సెటిల్ అవ‌డానికి కూడా బెస్ట్ సిటీ అంటోంది లావ‌ణ్య త్రిపాఠి. ఉత్త‌రాదికి చెందిన ఈ భామ సినిమా అవ‌కాశాలు వెతుక్కుంటూ హైద‌రాబాద్ వ‌చ్చింది. ఈ న‌గ‌రం ఆమెకి అన్ని ఇచ్చింది. డ‌బ్బు, ఫేమ్‌..ఇలా అన్ని ఇక్క‌డే ద‌క్క‌డం, ఇక్క‌డే స్నేహితులు కూడా ఏర్ప‌డ‌డంతో లావ‌ణ్య హైద‌రాబాద్‌లోనే స్థిర‌ప‌డుతానంటోంది.

ప్ర‌స్తుతం లావ‌ణ్య చేతిలో ఒకే తెలుగు సినిమా ఉంది. మునుప‌టితో పోల్చితే అంత క్రేజ్ లేదు. ఐనా ఇక్క‌డే సెటిల్ అవుతుంద‌ట‌. ఆమె ఇపుడు హైద‌రాబాద్‌లో ఒక విల్లా కొనే ప‌నిలో ప‌డింది. నాని, ర‌కుల్ వంటి తార‌లు రీసెంట్‌గా గ‌చ్చిబౌలి ఏరియాలో విల్లాస్ కొన్నారు. ఈ అమ్మ‌డు కూడా విల్లా కొనే టార్గెట్ పెట్టుకొంది.