ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న హీరోయిన్

Lavanya reaches her hometown
Wednesday, July 22, 2020 - 12:45

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా ఎంచక్కా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేశారని చాలామంది అనుకుంటున్నారు. అది నిజం కూడా. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ తల్లిదండ్రులకు దూరమై ఈ 3 నెలలు చాలా బాధపడ్డారు. ఇలాంటి హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు.

లాక్ డౌన్ పడే సమయానికి "చావుకబురు చల్లగా" అనే సినిమా షూటింగ్ లో ఉంది లావణ్య. సరిగ్గా అదే టైమ్ కు లాక్ డౌన్ పడడంతో హైదరాబాద్ లోనే ఇరుక్కుపోయింది. అలా 3 నెలలకు పైగా ఒంటరిగా ఉన్న లావణ్య, ఎట్టకేలకు తన సొంతూరికి బయల్దేరింది.

ఈరోజు హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ లోని తన సొంతింటికి వెళ్లింది లావణ్య త్రిపాఠి. కరోనా వైరస్ బాగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేవలం మాస్క్ పెట్టుకోవడానికే పరిమితమవ్వకుండా.. ఏకంగా పీపీఈ కిట్ కూడా వేసుకుంది. కళ్లకు పెద్ద గ్లాస్ కూడా పెట్టుకుంది. అలా పూర్తి జాగ్రత్తలు తీసుకొని ఇంటికెళ్లింది లావణ్య. కొన్ని రోజుల పాటు తల్లిదండ్రులతో ఉండి, షూటింగ్స్ మొదలవ్వగానే తిరిగి హైదరాబాద్ రాబోతోంది ఈ బ్యూటీ.