బోల్డ్ గా నటించేందుకు సై

Lavanya Tripathi is game for bold roles
Friday, May 1, 2020 - 17:15

లావణ్య త్రిపాఠి కూడా బోల్డ్ గేమ్ లోకి చేరుతోంది. లావణ్య అంటే పక్కింటి అమ్మాయి అనే పేరుంది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలు, సినిమాలు అలాంటివి. అయితే, OTT ఫ్లాట్ ఫార్మ్ లు వచ్చాక భామలు అందరూ ఎక్స్ పోజింగ్, ముద్దులు వంటివి చెయ్యక తప్పడం లేదు. ఈ రేస్ లో తాను కూడా చేరుతాను అంటోంది.

ప్రస్తుతం లావణ్య ... సందీప్ కిషన్ సరసన "ఏ 1 ఎక్స్ ప్రెస్", కార్తికేయ సరసన "చావు కబురు చల్లగా", మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. మూడు విభిన్న చిత్రాలే. ఒకవేళ ఎవరైనా బోల్డ్ గా నటించమని కోరితే, పాత్ర నచ్చితే ...వెనుకాడను అంటోంది ఈ అందాల రాక్షసి.