పవన్ కళ్యాణ్ నిజమైన హీరో: లావణ్య

Lavanya Tripathi talks about Pawan Kalyan and his character
Tuesday, May 19, 2020 - 13:45

అందరికీ క్రికెట్ అంటే ఇష్టం. లావణ్యకు మాత్రం బాడ్మింటన్ అంటే ఇష్టం. చాలామందికి విదేశాలు నచ్చుతాయి. లావణ్యకు మాత్రం ఇండియాలోనే ఓ ఫేవరెట్ హాలిడే స్పాట్ ఉంది. ఈ క్వారంటైన్ టైమ్ లో తన మనసుకు నచ్చిన విషయాల్ని చాలా బయటపెట్టింది లావణ్య త్రిపాఠి. ఆమె ఇంకా ఏం చెబుతోందా చూద్దాం.

- మొదటి సినిమా అనుభవం
నా మొదటి సినిమా బడ్జెట్ చాలా చిన్నది. కారవాన్ కూడా లేదు. ప్రొడక్షన్ వ్యాన్ లో దుస్తులు మార్చుకున్నాం.

- పవన్ గురించి ఒక్క మాటలో..
ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదురు నిలబడే అతని ధైర్యం అంటే ఇష్టం. నిజమైన హీరో

- ఇష్టమైన కార్టూన్
టామ్ అండ్ జెర్రీ

- ప్రభాస్ గురించి ఒక్క మాట
అతడు చాలా కూల్

- క్వారంటైన్ టైమ్ లో ఏం చేస్తున్నారు?
లేవడం.. వండుకోవడం.. తినడం.. పడుకోవడం..

- ఈ లాక్ డౌన్ టైమ్ లో ఏం నేర్చుకున్నారు?
నిశ్శబ్దంగా ఉండడం

- నటిగా మారడానికి స్ఫూర్తి
శ్రీదేవి, మాధురీదీక్షిత్

- నాగార్జున గురించి
జీవితాన్ని ఫుల్ గా ఎలా ఎంజాయ్ చేయాలో నాగ్ ను చూసి నేర్చుకోవాలి

- ఇష్టమైన గేమ్
బ్యాడ్మింటన్ ఆడడం ఇష్టం. ఇప్పుడు హాకీని కూడా ఇష్టపడుతున్నాను

- రీసెంట్ గా చూసిన వెబ్ సిరీస్
అమెజాన్ ప్రైమ్ లో ల్ లోక్ చూశాను.. చాలా బాగుంది

- బ్యూటీ సీక్రెట్
లోపల మనం ఎంత బాగున్నామనేది ఇంపార్టెంట్. పైకి అదే అందంగా కనిపిస్తుంది

- ఓ నటికి బాగా ఇబ్బందికరమైన అంశం ఏంటి?
టాబ్లాయిడ్ లో మన గురించి రాసిన ప్రతిదీ నిజమని ప్రేక్షకుడు నమ్ముతున్నాడు. అదే చాలా బాధాకరమైన విషయం.

- ఇష్టమైన ప్రదేశం?
నైనిటాల్ అంటే చాలా ఇష్టం

- అప్ కమింగ్ ప్రాజెక్టులు
చావుకబురు చల్లగా, ఏ-1 ఎక్స్ ప్రెస్, ఓ తమిళ సినిమా