పాపం హీరోయిన్లకి కష్ట కాలమే!

Lockdown is affecting heroines badly
Thursday, May 14, 2020 - 17:15

లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ స్లంప్ లో పడింది. రిలీజెస్ ఆగిపోయాయి. షూటింగ్స్ నిలిచిపోయాయి. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో హీరోలు తమ రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటే బాగుంటుందనే వాదన బయల్దేరింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడీ మేటర్ హీరోయిన్ల వైపు టర్న్ అయింది.

లాక్ డౌన్ తర్వాత హీరోయిన్లు కూడా తమ రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాలనే చర్చ షురూ అయింది. హీరోలతో పోలిస్తే హీరోయిన్లు తీసుకునే పారితోషికం చాలా చాలా తక్కువ. ఉదాహరణకు "అల వైకుంఠపురము"లో సినిమాకు బన్నీ 20 కోట్లు తీసుకుంటే పూజా హెగ్డేకు కోటి పాతిక లక్షలిచ్చారు. హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్ల తేడా ఆ రేంజ్ లో ఉంటుంది. అయినప్పటికీ హీరోయిన్లు కూడా తగ్గించుకుంటే మంచిదనే వాదన కొత్తగా మొదలైంది.

నిజానికి ఈ విషయంలో హీరోయిన్లకు ఆప్షన్ లేదు. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ అది 2-3 సినిమాల వరకే. నాలుగో సినిమాకు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకోకపోతే.. ఆటోమేటిగ్గా ఆ స్థానంలోకి మరో హీరోయిన్ వస్తుంది. ఇక కొత్తగా వచ్చే హీరోయిన్లకు, అరకొర క్రేజ్ ఉన్న మిగతా భామలకైతే మరీ నరకం. లాక్ డౌన్ పేరు చెప్పి వాళ్లకు సగానికి సగం కోసేస్తారు.

ఏదేమైనా లాక్ డౌన్ తర్వాత హీరోల రెమ్యూనరేషన్లు ఏ స్థాయిలో తగ్గుతాయో చెప్పలేం కానీ.. హీరోయిన్లు, టెక్నీషియన్ల పారితోషికాలు మాత్రం భారీగా తగ్గబోతున్నాయి. ఆల్రెడీ కమిట్ మెంట్లు పూర్తయి, అగ్రిమెంట్లలో సంతకాలు పెట్టిన వాళ్లకు కూడా పేపర్ పై ఉన్నంత వస్తుందనే గ్యారెంటీ లేదు.