ఇప్పుడు అన్నీ ఇంట్లోనే చేస్తున్నా

Lockdown chitchat with Seerat Kapoor
Thursday, May 21, 2020 - 13:15

తను స్లిమ్ గా ఉంటేనే ఆడియన్స్ కు ఇష్టమంటోంది హీరోయిన్ సీరత్ కపూర్. "రన్ రాజా రన్", "రాజు గారి గది 2", టచ్ చేసి చూడు" వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ లాక్ డౌన్ టైమ్ లో బరువు పెరగకుండా చాలా జాగ్రత్తపడ్డానని చెబుతోంది. మరి ఇంటిలో ఖాళీగా ఉన్న సీరత్ ఏం చేస్తోంది.. లెట్స్ ఛెక్..

లాక్ డౌన్ వల్ల బాగా మిస్ అయింది ఏంటి?
ఈ లాక్ డౌన్ లో థియేటర్లు బాగా మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను టీవీల్లో మూవీస్, సిరీస్ చూడ్డానికి ఎక్కువ ఇష్టపడను. టైమ్ దొరికితే థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తాను. అందుకే ఈ లాక్ డౌన్ టైమ్ లో థియేటర్లను బాగా మిస్ అవుతున్నాను. థియేటర్ల తర్వాత ఫ్రెండ్స్ ను మిస్ అవుతున్నాను.

లాక్ డౌన్ ఎత్తేస్తే చేసే మొదటి పని?
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత చేసే మొదటి పని షూటింగ్ కు వెళ్లడమే. నేను వెంటనే చేసే పని అదే. ఔట్ సైడ్ ఫుడ్ ను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ లేదు. ఎందుకంటే నాకు ఇంట్లో చేసిన భోజనమే ఇష్టం.

 కొత్తగా ఏం వంటలు చేశారు?
ఈ లాక్ డౌన్ టైమ్ లో చాలా వంటలు ట్రై చేశాను. నాకు హల్వా బాగా నచ్చింది. అది చేయడం కూడా చాలా ఈజీ. దీంతో పాటు రెగ్యులర్ గా కూరగాయలతో ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉన్నాను. కూరల్లో ఎక్కువగా మసాలాలు వేయడం నాకు ఇష్టం ఉండదు. ప్రతి కూరగాయకు ఓ ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయాలి. మసాలాలు వేస్తే అన్నీ ఒకేరకంగా అయిపోతాయి. అందుకే నేను కూరగాయల్ని నేచురల్ గానే వండుతాను.

లాక్ డౌన్ లో బాగా నిద్రపోతున్నారా?
ఈ లాక్ డౌన్ టైమ్ లో అంతా బాగా నిద్రపోతున్నారు. కానీ నేను మాత్రం చాలా తక్కువగా నిద్రపోతున్నాను. సాధారణంగానే నాకు తక్కువగా నిద్రపోవడం అలవాటు. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఆ అలవాటు మారదు కదా.

బరువు పెరిగారా?
లాక్ డౌన్ లో అస్సలు బరువు పెరగలేదు. నా ట్రయినర్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాను. అతడు చెప్పిన వర్కవుట్స్ అన్నీ ఇంట్లోనే చేస్తున్నాను. కాకపోతే మధ్యమధ్యలో ఐస్ క్రీమ్స్ తింటున్నాను. అయినప్పటికీ పెర్ ఫెక్ట్ గా ఉన్నాను.

టీవీలో ఏం చూస్తున్నారు?
ఇంట్లో పెద్దగా టీవీ చూడను. వార్తల కోసం మాత్రమే పెడుతుంటాను. మిగతా టైమ్ అంతా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తోనే గడిచిపోతుంది. సినిమాలు తక్కువగా చూస్తున్నాను. సిరీస్ లు ఎక్కువగా చూస్తున్నాను.