లక్డౌన్లో పూజా పని అదే!

Lockdown: Pooja Hegde reveals her daily routine
Wednesday, April 1, 2020 - 23:30

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా తమకు తోచినట్టు బతికేస్తున్నారు. శృతిహాసన్ అయితే నచ్చిన వంటకాలు స్వయంగా వండుకొని తినేస్తోంది. పాయల్ అయితే తెలుగు నేర్చుకుంటోంది. ఇప్పుడు పూజా హెగ్డే కూడా తన డెయిలీ రొటీన్ బయటపెట్టింది.

లాక్ డౌన్ టైమ్ లో తను చేస్తున్న పని కేవలం పడుకోవడం, తినడం, టీవీ చూడడం మాత్రమే అంటోంది పూజా హెగ్డే. ఇప్పటికే తింటున్న ఫొటోని షేర్ చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఎక్కువగా నిద్రపోతున్నానని.. ఫేవరెట్ వెబ్ సిరీస్ కూడా చూస్తున్నానని చెబుతోంది. ట్విట్టర్ లో ఫ్యాన్స్ లో ఛాటింగ్ చేసిన ఈ బ్యూటీ.. హోమ్ ల్యాండ్, హౌజ్ ఎండీ, డార్క్, దిసీజ్ అజ్ ను తన ఫేవరెట్ టీవీ షోజ్ గా చెప్పుకొచ్చింది. వీటితో పాటు తను రెగ్యులర్ గా వాట్సాప్, ఇనస్టాగ్రామ్ వాడుతానని స్పష్టంచేసింది.

క్లిష్ట పరిస్థితుల్లో కూడా హ్యాపీగా ఉండడమే తన జీవన రహస్యం అంటోంది పూజా. మంచి జ్ఞాపకాల్ని ఎప్పటికప్పుడు గుర్తుకు తెచ్చుకొని హ్యాపీగా ఉండాలంటోంది. తన స్మైల్ సీక్రెట్ అదేనని స్పష్టంచేసింది. ఇక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత తను మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యానని చెప్పుకొచ్చిన పూజా.. రజనీకాంత్ ను లెజెండ్ గా, నానిని బ్రిలియంట్ యాక్టర్ గా చెప్పుకొచ్చింది. ఇక తన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను తన జీవితంలో వెరీవెరీ స్పెషల్ వ్యక్తిగా చెప్పుకొచ్చింది.