మే 31 వరకు లాక్డౌన్

Lockdown till May 31 extended
Sunday, May 17, 2020 - 19:00

ఈ నెల 31 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కంటిన్యూ  కానుంది. మే 17తో మూడో దశ ముగిసింది. ఇది నాలుగో లాక్డౌన్. అయితే హైదరాబాద్, విశాఖపట్నం వంటి రెడ్ జోన్ నగరాల్లోనూ ఈసారి ఎక్కువ సడలింపులిచ్చారు. సినిమా షూటింగులకు మాత్రం అనుమతి లేదు. మరో రెండు నెలల వరకు ఇంతే! 

రెడ్, గ్రీన్, ఆరంజ్ జోన్లు రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చని కేంద్రం చెప్పడం ఒక ఊరట. 

తెలంగాణలో ఇప్పటికి ప్రతిరోజు 30 నుంచి 50 కేసులు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ సంఖ్య దాదాపు సమానమే. తెలంగాణలో కేవలం హైదరాబాద్, అదీ కూడా పాత బస్తీ, మలక్ పెట్, ఎల్ బీ నగర్ ప్రాంతాల్లోనే కేసులు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చిత్తూర్, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా కేసులు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఐతే ఈ కరోనా వ్యాధి ఎప్పుడు విజృంభిస్తోందో తెలీదు. అందుకే ప్రభుత్వాలు లాక్డౌన్  ని కొనసాగిస్తున్నాయి. 

తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది.