ఉస్తాద్‌గా బాల‌య్య గెట‌ప్ ఇదేనా?

Is this look that Balayya sporting for Puri's film?
Tuesday, May 9, 2017 - 17:15

తన సినిమాల్లో హీరోల్ని కొత్తగా చూపించడం పూరి జగన్నాధ్ కు చాలా ఇష్టం. కుదిరితే సిక్స్ ప్యాక్ లో చూపిస్తాడు. కుదరకపోతే కనీసం హెయిర్ స్టయిల్ అయినా మారుస్తాడు. మరి ఇలాంటి దర్శకుడితో సినిమా చేస్తున్న బాలయ్య.. ఎలా కనిపిస్తాడనే క్యూరియాసిటీ బాగానే ఉంది. ఆ క్యూరియాసిటీకి తగ్గట్టే బాలయ్య నయా పిక్ నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఫొటో చూస్తుంటే బాలయ్య కాస్త కొత్తగానే కనిపిస్తున్నాడు. కాకపోతే ఇది పూరి సినిమాలో స్టిల్ అవునా కాదా అనేది పెద్ద డౌట్. చాలామంది మాత్రం బాలయ్య 101వ సినిమాలో గ్యాంగ్ స్టర్ గెటప్ ఇదేనంటూ ప్రచారం చేస్తున్నారు.

ఎల్లుండి పోర్చుగల్ కు బయల్దేరుతున్నాడు బాలయ్య. అక్కడే 40రోజుల పాటు షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ లో ఈ గెటప్ తోనే షూట్ చేయబోతున్నారట. ఫొటో చూస్తుంటే, గ్యాంగ్ స్టర్ గెటప్ కు సరిగ్గా సరిపోయింది. కాకపోతే ఫైనల్ లుక్ ఇదేనా, ఇంకేమైనా మార్పులు ఉన్నాయా అనేది తేలాలి. శ్రియ, ముష్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ అనుకుంటున్నారు.