కమల్ పాలి'ట్రిక్స్'కి నిర్మాత చెక్

Lyca puts Kamal Haasan in place
Thursday, February 27, 2020 - 09:30

కమల్ హాసన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దాంతో రాజకీయ లాభం కోసం తన నిర్మాతకి వ్యతిరేకంగా కామెంట్ చేశారు. కానీ అది బూమ్ రాంగ్ అయింది. నిర్మాత రివర్స్ లో ఘాటుగా క్లాస్ పీకాడు. అసలు విషయం ఏంటంటే... 

"ఇండియన్ 2" (భారతీయుడు 2) సినిమా షూటింగ్ సందర్భంగా ఒక క్రేన్ కూలి ముగ్గురు చనిపోయారు, పది మంది గాయపడ్డారు. సినిమా సెట్ లో ఇది చాలా ఘోర ప్రమాదం. జనరల్ గా షూటింగ్ సందర్భంగా క్రేన్లు పడిపోవడం అంటూ ఉండదు. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటారు. "ఇండియన్ 2" సినిమా సెట్ లో జరిగింది మాత్రం ఘోరం, మానవ తప్పిదమే. దర్శకుడు శంకర్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నిర్మాత సుభాస్కరన్ స్పందించారు. లండన్ నుంచి చెన్నయికి హుటాహుటిన వచ్చి ... బాధిత కుటుంబాలను పరామర్శించారు. రెండు కోట్ల పరిహారం ఇచ్చారు. 

కానీ, కమల్ హాసన్ మాత్రం నిర్మాతలు కనీస జాగ్రత్తలు తీసుకోలేదు, సెట్ ని ఇలా కాదు మైంటైన్ చెయ్యడం, వారికీ బాధ్యత లేదు అన్నట్లుగా మీడియాలో కామెంట్ చేశారు. సినిమా ఇండస్ట్రీ లో 50 ఏళ్ల కెరీర్ ని కంప్లీట్ చేసుకున్న కమల్ .... తనని ఎవరూ వేలెత్తి చూపకుండా ఇలా మాట్లాడారు.రాజకీయంగా తనకి ఇది ఇబ్బంది కలిగిస్తుందని అలా అన్నట్లు ఉన్నారు. కానీ, నిర్మాత వెంటనే ఒక ప్రకటన విడుదల చేసారు. "కమల్ గారు మీరు స్పందించక ముందే మేము స్పందించాం. ఇక సెట్ లో సౌకర్యాలు, జాగ్రత్తలు అంటారా... అవన్నీ తీసుకున్నాం. ఇంకా చెప్పాలంటే... సినిమా నిర్మాణం మాదే అయినా... సినిమాని మొత్తం నడిపేది మీరు, దర్శకులు శంకరే. ఆఖరికి సెట్ లో ఉండి అన్ని జాగ్రత్తలు చూసుకోవాలిసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ని కూడా శంకర్ తాను చెప్పిన వ్యక్తిని నియమించాము," అంటూ ఘాటుగా లేఖలో రాశారు. 

ఈ రోజుల్లో నిర్మాత ఎవరైనా మొత్తం ప్రొడక్షన్ బాధ్యత అంతా హీరోలు, డైరెక్టర్లు చూసుకుంటారు. నిర్మాతలని క్యాషియర్లుగా మలిచింది మన స్టార్ హీరోలే.