సుద్దాల అశోక్ తేజకు రేపే ఆపరేషన్

Lyricis Suddala Ashok Tej to undergo surgery
Friday, May 22, 2020 - 16:45

ప్రముఖ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ ఈరోజు (May 22) హాస్పిటల్ జాయిన్ అయ్యారు. కొంతకాలంగా లివర్ సమస్యతో ఆయన బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో రేపు ఆయనకు ఆపరేషన్ చేయబోతున్నారు. సుద్దాల ఆరోగ్య పరిస్థితిపై నిన్నట్నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని అశోక్ తేజ మేనల్లుడు, నటుడు ఉత్తేజ్ నిర్థారించారు.

మామయ్య అశోక్ తేజ అనారోగ్యంతో ఉన్నారంటూ వస్తున్న వార్తలు నిజమేనని నిర్థారించాడు ఉత్తేజ్. అయితే అంతా ఆందోళనపడే స్థాయిలో ఏమీ లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపాడు. మరోవైపు ఆపరేషన్ కు బ్లడ్ దొరకలేదనే వార్తల్ని ఉత్తేజ్ ఖండించాడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు ఫోన్ చేసిన వెంటనే కావాల్సిన డొనర్లను అందుబాటులోకి తీసుకొచ్చారని, మరీ ముఖ్యంగా చిరంజీవి ప్రత్యేకంగా అశోక్ తేజకు ఫోన్ చేసి పరామర్శించి ధైర్యం చెప్పారని ఉత్తేజ్ అన్నారు.

తన మామయ్య కోలుకోవాలని కాంక్షిస్తున్న అందరికీ ఉత్తేజ్ థ్యాంక్స్ చెప్పాడు.

తన సర్జరీకి రక్తం అవసరం అవుతుందేమో అనే అనుమానాన్ని అశోక్ తేజ, తన స్నేహితుడితో చెప్పారు. దీంతో ఆయన స్నేహితుడు ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడంలో రకరకాల వదంతులు వ్యాపించాయి. ఉత్తేజ్ ప్రకటనతో సుద్దాల అశోక్ తేజ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్పష్టత వచ్చింది.