న‌వంబ‌ర్ రెండో వారంలో 'ఇద్ద‌రి లోకం ఒక‌టే'

Maa Iddari Loksam Okate for Nov
Monday, October 7, 2019 - 15:15

రాజ్ తరుణ్ కొత్త సినిమాకి రిలీజ్ డేట్ కుదిరింది. రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్న చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. 
దిల్‌రాజుకి చెందిన వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న ఈ మూవీ తో జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఇప్ప‌టికే 90 శాతం సినిమా పూర్త‌య్యింది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ రెండో వారంలో విడుద‌ల చేయడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ఇటీవల రాజ్ తరుణ్ ఒక కార్ ఆక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నాడు.ఆ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. దాంతో ఆ వివాదం నుంచి తొందర్లోనే బయటపడ్డాడు. దిల్ రాజు ... రాజ్ తరుణ్ తో ఇంతకుముందు 'లవర్' అనే సినిమా నిర్మించాడు. కానీ అది ఆడలేదు. మరి ఇప్పుడైనా వీరి కాంబినేషన్ విజయాన్ని తెస్తుందా?